ప్రభన్యూస్

ఆరు దశాబ్దాల తర్వాత అరకు రైల్వే స్టేషన్‌కు మహర్దశ!

మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు.. త్వరలో పనులకు శ్రీకారం పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజారాణి.

ప్రభ న్యూస్, అరకులోయ, అక్టోబర్ 17:

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక కేంద్రమైన అరకులోయ రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. దాదాపు 60 ఏళ్ల తర్వాత స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయని అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజారాణి వెల్లడించారు. తన కృషితో అభివృద్ధి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చుతుండటం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.అరకు ప్రాంత ప్రజలతో పాటు నిత్యం ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. పర్యాటకంగా విశేష గుర్తింపు పొందిన అరకులోయకు వచ్చే సందర్శకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడంలో ఈ అభివృద్ధి పనులు కీలకంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న మౌలిక సదుపాయాల మెరుగుదలతో అరకు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు గుమ్మ తనూజారాణి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 9:37 pm Digital Edition : Prabhanews
<b>ఆరు దశాబ్దాల తర్వాత అరకు రైల్వే స్టేషన్‌కు మహర్దశ</b>!