Diabetes Warning Signs: సాధారణంగా మధుమేహం అనగానే అందరికీ గుర్తొచ్చేవి అతిగా దాహం వేయడం, మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లడం, విపరీతమైన ఆకలి మాత్రమేనని 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బి కార్తీక్ రావు వివరిస్తున్నారు. కానీ డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు శరీరం మనం అస్సలు ఊహించని ఎన్నో వింత సంకేతాలను ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు. చాలామంది వీటిని రోజువారీ అలసట లేదా సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం (లైట్) చేస్తుంటారని తెలుపుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు నిశ్శబ్దంగా పెరిగిపోతున్నప్పుడు నాడీ వ్యవస్థ, చర్మం, కళ్లు లోలోపలే దెబ్బతింటాయని, వీటిని సకాలంలో గుర్తించకపోతే గుండె, కిడ్నీలు శాశ్వతంగా పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న ఆ 5 ప్రధాన ఊహించని మధుమేహ సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

