ఈ నూతన సవరణల ప్రకారం ఆభరణాల రేట్లలో ఎంత మేర కోత పడిందో ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ స్పష్టంగా తెలియజేస్తోంది. బంగారు ఆభరణాలపై (టారిఫ్ ఐటమ్ 711301 పరిధిలోకి వచ్చేవి) డ్యూటీ డ్రాబ్యాక్ రేటును గతంలో ఉన్న గ్రాముకు ₹1,851.99 నుండి ₹1,794.11కి తగ్గించారు. దీనివల్ల పసిడి ఎగుమతిదారులకు ఇప్పుడు ప్రతి గ్రాముపై ₹57.88 వరకు రీఫండ్ తగ్గుతుంది. అదేవిధంగా, వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువుల (టారిఫ్ ఐటమ్స్ 711302, 711401) విషయంలో ఈ రేటు కిలోగ్రాముకు ₹29,501.09 నుండి ఏకంగా ₹26,859.02కి పడిపోయింది. అంటే వెండి ఎగుమతిదారులకు ప్రతి కిలోగ్రాముపై ఏకంగా ₹2,642.07 మేర వాపసు మొత్తం తగ్గనుంది.

