ప్రభన్యూస్

Supreme Court: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు! |


Last Updated:

హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన పాత కులం ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవోను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది.

News18
News18

హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు, తాము గతంలో పొందిన కుల హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. మత మార్పిడి జరిగిన వెంటనే పూర్వ సామాజిక వర్గ హోదా లేదా రిజర్వేషన్ హక్కులు కొత్త మతంలోకి బదిలీ కావని కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద కల్పించే రిజర్వేషన్లు పాత మతంలో ఉన్న వెనుకబాటుతనం ఆధారంగా ఇతర మతాల్లో ఆటోమేటిక్‌గా వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ప్రభుత్వ ఉత్తర్వు రద్దు.. హైకోర్టు తీర్పు సమర్థన

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. తమిళనాడులోని బీసీ, ఎంబీసీ, డీఎన్‌సీ లేదా ఎస్సీ వర్గాల నుంచి ఇస్లాంలోకి మారిన వారికి ఏడు బీసీ ముస్లిం కేటగిరీల కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వం 2024 మార్చి 9న ఒక జీవో తెచ్చింది. ఇందులో అన్సార్, దక్కని, దూదేకుల, లబ్బై, మాపిల్ల, షేక్, సయ్యద్ వర్గాలు ఉన్నాయి. అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఇస్లాంలోకి మారిన వారిని ముస్లింలుగా గుర్తించవచ్చని, అంతమాత్రాన నోటిఫై చేసిన బీసీ ముస్లిం వర్గాల్లో చేర్చలేమని హైకోర్టు పేర్కొన్న అంశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

ఎస్సీ హోదా నిబంధనలు.. సుప్రీంకోర్టు స్పష్టత

రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. ఎవరైనా తిరిగి హిందూ మతంలోకి మారినప్పుడు కూడా పాత హోదా వెంటనే వర్తించదని, సంబంధిత సామాజిక వర్గం వారిని అంగీకరించిందా లేదా అన్నది విచారించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.

2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి ‘ముస్లిం లబ్బై’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, తహసీల్దార్ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. ఆయన హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం జీవో సమర్పించింది. హైకోర్టు ఆ జీవోను రద్దు చేయడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 2:31 pm Digital Edition : Prabhanews
Supreme Court: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు! |

Last Updated:Oct 15, 2026 2:21 PM ISTహిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన పాత కులం ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవోను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది.News18హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు, తాము గతంలో పొందిన కుల హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. మత మార్పిడి జరిగిన వెంటనే పూర్వ సామాజిక వర్గ హోదా లేదా రిజర్వేషన్ హక్కులు కొత్త మతంలోకి బదిలీ కావని కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద కల్పించే రిజర్వేషన్లు పాత మతంలో ఉన్న వెనుకబాటుతనం ఆధారంగా ఇతర మతాల్లో ఆటోమేటిక్‌గా వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.ప్రభుత్వ ఉత్తర్వు రద్దు.. హైకోర్టు తీర్పు సమర్థనన్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. తమిళనాడులోని బీసీ, ఎంబీసీ, డీఎన్‌సీ లేదా ఎస్సీ వర్గాల నుంచి ఇస్లాంలోకి మారిన వారికి ఏడు బీసీ ముస్లిం కేటగిరీల కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వం 2024 మార్చి 9న ఒక జీవో తెచ్చింది. ఇందులో అన్సార్, దక్కని, దూదేకుల, లబ్బై, మాపిల్ల, షేక్, సయ్యద్ వర్గాలు ఉన్నాయి. అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఇస్లాంలోకి మారిన వారిని ముస్లింలుగా గుర్తించవచ్చని, అంతమాత్రాన నోటిఫై చేసిన బీసీ ముస్లిం వర్గాల్లో చేర్చలేమని హైకోర్టు పేర్కొన్న అంశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.ఎస్సీ హోదా నిబంధనలు.. సుప్రీంకోర్టు స్పష్టతరాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. ఎవరైనా తిరిగి హిందూ మతంలోకి మారినప్పుడు కూడా పాత హోదా వెంటనే వర్తించదని, సంబంధిత సామాజిక వర్గం వారిని అంగీకరించిందా లేదా అన్నది విచారించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి 'ముస్లిం లబ్బై' సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, తహసీల్దార్ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. ఆయన హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం జీవో సమర్పించింది. హైకోర్టు ఆ జీవోను రద్దు చేయడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.మరింత చదవండి

Source link