Last Updated:
Bigg Boss Telugu 10 Week 6 Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం నామినేషన్ల పర్వం హౌస్‌లో అగ్గి రాజేసింది. వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత కంటెస్టెంట్ల మధ్య సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం నామినేషన్ల పర్వం హౌస్‌లో అగ్గి రాజేసింది. వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత కంటెస్టెంట్ల మధ్య సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తమకు సంబంధం లేని విషయాల్లో కూడా కొందరు సభ్యులు తలదూర్చడం, పాత గొడవలను తవ్వి తీయడంతో హౌస్ వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. ఒకరి నామినేషన్ ప్రక్రియలో మరొకరు జోక్యం చేసుకోవడం, తీవ్ర స్థాయి వాగ్వాదాలకు దిగడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా షాలిని – వర్షిణి మధ్య జరిగిన గొడవ, అలాగే రోహిత్, వంశీ, త్రిగుణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. ఈ తీవ్రమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి ఆరో వారానికి గానూ మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. రోహిత్, రామ్ ప్రసాద్, వంశీ, అమన్, వర్షిణి, షాలిని ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.
ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. ప్రేక్షకుల మద్దతు ఎవరికి ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. హౌస్‌లో వరుస గొడవలు, వివాదాలతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన రోహిత్ ఓటింగ్‌లో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నాడు. అతనికి ఏకంగా 26.54 శాతం ఓట్లు పోలవుతుండటం గమనార్హం. రోహిత్‌కు ఉన్న బలమైన ఫ్యాన్ బేస్ దీనికి కారణమని తెలుస్తోంది. ఇక 17.75 శాతం ఓట్లతో రామ్ ప్రసాద్ రెండో స్థానంలో నిలిచి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మొదటి, రెండు స్థానాల మధ్య ఓటింగ్ వ్యత్యాసం భారీగా ఉంది.
నామినేషన్స్ లో షాలినిని గట్టిగా టార్గెట్ చేయడంతో పాటు, రోహిత్ కు ధీటుగా బదులిచ్చిన వంశీ 15.23 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. హౌస్ లో తన వాదనను బలంగా వినిపిస్తున్న వంశీకి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ దక్కుతోంది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న అమన్, వర్షిణి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అమన్ 14.25 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వర్షిణి 14.14 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంది. వీరిద్దరి మధ్య కేవలం 0.11 శాతం మాత్రమే తేడా ఉండటంతో ఏ క్షణమైనా స్థానాలు తారుమారయ్యే అవకాశం ఉంది.
అందరికంటే చివరగా 12.09 శాతం ఓట్లతో షాలిని డేంజర్ జోన్‌లో ఉంది. వర్షిణితో పెట్టుకున్న గొడవ, ఇతర సభ్యులతో వ్యవహరించిన తీరు, ముఖ్యంగా రోహిత్ కు వత్తాసు పలుకుతూ ఆమె చేస్తున్న అతి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ ప్రతికూలతే ఇప్పుడు ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్ నాటికి ఈ ఓటింగ్ లెక్కలు మారతాయా లేక షాలిని హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

