కేరళ, తమిళనాడు వైపు ప్రయాణించాలనుకునే వారి కోసం నాలుగు స్పెషల్ రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది. 07001 నంబర్ రైలు ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి వెళ్తుంది. ఈ రైలులో అక్టోబర్ 29న 203 బెర్తులు, నవంబర్ 5న 255, నవంబర్ 12న 163, నవంబర్ 19న 208, నవంబర్ 26న 291 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. 07003 నంబర్ రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి నడుస్తుంది. ఈ రైలులో అక్టోబర్ 20న 214 బెర్తులు, అక్టోబర్ 27న 418 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 3న 560, నవంబర్ 10న 589, నవంబర్ 17న 682 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. 07193 నంబర్ రైలు ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి కొల్లాంకు నడుస్తుంది. ఈ రైలులో అక్టోబర్ 31న 152 బెర్తులు, నవంబర్ 7న 164 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 07191 నంబర్ రైలు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి రేణిగుంట, మదురై మీదుగా సెంగోట్టైకి వెళ్తుంది. ఈ రైలులో అక్టోబర్ 23న 277 బెర్తులు, అక్టోబర్ 30న 583 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 6న 311, నవంబర్ 13న 539, నవంబర్ 20న 591, నవంబర్ 27న 622 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

