ప్రస్తుతం కాస్మోస్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్, విజయవాడలోని గవర్నర్పేటలో రెండు రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరిస్తున్న ఈ బ్రాండ్, కీలక నగరాలు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ స్టోర్లను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్లో మరిన్ని స్టోర్లతో పాటు చెన్నై, పుణె, ముంబై, విశాఖపట్నం(వైజాగ్), వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మరియు కోయంబత్తూరు వంటి ప్రముఖ నగరాలకు విస్తరించాలని కాస్మోస్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ యోచిస్తోంది. భారత్లోని వినియోగదారులకు ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, మారుతున్న డైమండ్ ఆభారణాల రిటైల్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వ్యూహాత్మక విస్తరణ దోహదపడుతుందని కంపెనీ తెలిపింది.

