ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక పీఎం-కుసుమ్ వెబ్సైట్ https://pmkusum.mnre.gov.in ను సందర్శించాలి. అక్కడ కాంపోనెంట్ ఏకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, డిస్కం నోటిఫికేషన్లు, సబ్స్టేషన్లలో అందుబాటులో ఉన్న విద్యుత్ సామర్థ్యం, ఎంపిక నిబంధనలను పరిశీలించాలి. ఆ తర్వాత దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి ప్రాజెక్టు రుణం, అవసరమైన పత్రాలు, వడ్డీ రేటు, ఇతర ఛార్జీల వివరాలు తెలుసుకోవాలి. రుణ మంజూరు అనేది బ్యాంకు పరిశీలన, అర్హతలు, అప్పటికి అమల్లో ఉన్న నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఎస్బీఐ పీఎం-కుసుమ్ పథకం కాంపోనెంట్ ఏ ద్వారా అర్హులైన రైతులు తమ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు ఖర్చులో 70 శాతం వరకు, గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు రుణం పొందవచ్చు. డిస్కంతో ఒప్పందం ప్రకారం 25 సంవత్సరాల పాటు విద్యుత్ విక్రయించే అవకాశం కూడా ఉంటుంది. అయితే, ఈ పథకం కింద ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా పెట్టుబడి సబ్సిడీ ఇవ్వదు. రుణం కూడా బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా మంజూరు అవుతుంది. కాబట్టి ప్రాజెక్టు ప్రారంభించే ముందు అధికారిక పీఎం-కుసుమ్ వెబ్సైట్లో వివరాలు పరిశీలించి, దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)

