ప్రభన్యూస్

ఐఐటీ బాంబే మార్గదర్శకత్వంలో శ్రీ చైతన్యలో ఇన్నోవేషన్ వర్క్‌షాప్

ప్రభ న్యూస్/ఖమ్మం:

విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా పలు కళాశాలలను ఎంపిక చేయగా మొత్తం 15 కళాశాలలు ఎంపికయ్యాయని, వాటిలో శ్రీ చైతన్య కూడా చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. కళాశాలకు ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ధనలక్ష్మి గోపాల్ మెంటార్‌గా నియమితులయ్యారని తెలిపారు. ఈ ఇన్నోవేషన్ సెల్ ద్వారా విద్యార్థులు సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి సాంకేతిక పరిష్కారాలను రూపొందించే దిశగా ప్రోత్సాహం పొందుతారని పేర్కొన్నారు. అకడమిక్ విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఐఐటీ బాంబే వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లభిస్తుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ బాంబే ప్రతినిధి షేక్ సాహిల్ జమీల్ మాట్లాడుతూ, ఇన్నోవేషన్ సెల్ ద్వారా విద్యార్థులకు స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ సెంటర్లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్‌లో స్వయంగా స్టార్టప్‌లను ప్రారంభించే స్థాయికి ఎదగడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందుతుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమల సహకారంతో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక రంగానికి సిద్ధం చేయడంలో శ్రీ చైతన్య మరో ముందడుగు వేసిందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట చలపతి మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వినియోగం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంకేతిక అంశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ విభాగం అధిపతి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఇటువంటి వర్క్‌షాప్‌లు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డీన్ అకాడమిక్స్ డాక్టర్ సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్, ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హెడ్ డాక్టర్ మురళి మోహన్‌తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 October 2026, 4:46 pm Digital Edition : Prabhanews
<b>ఐఐటీ బాంబే మార్గదర్శకత్వంలో శ్రీ చైతన్యలో ఇన్నోవేషన్ వర్క్‌షాప్</b>