బజాజ్ ప్రకటించిన ఈ పథకం పల్సర్ శ్రేణిలోని విస్తృత మోడళ్లకు వర్తిస్తుంది. ఇందులో పల్సర్ 125, NS125, పల్సర్ 150, N160 S/SS, NS160, NS200, N250, పల్సర్ 220F, RS200, NS400Z ఉన్నాయి. గరిష్ఠంగా రూ.12,000 వరకు ప్రయోజనం ఉన్నప్పటికీ, అందులో నగదు రాయితీ ఎంత, ఇతర ప్రయోజనాలకు ఎంత విలువ కేటాయించారనే వివరాలను సంస్థ మోడల్ వారీగా వెల్లడించలేదు. అంతేకాకుండా మార్కెట్‌ను బట్టి ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చని బజాజ్ తెలిపింది.

