50 పైసల నాణెం ఇంకా చలామణిలో ఉందా.? : ముందుగా 50 పైసల నాణెం చట్టబద్ధమైన చెల్లింపు సాధనమా (legal tender) కాదా అనే విషయాన్ని స్పష్టం చేసుకుందాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10 మరియు రూ.20 విలువ గల వివిధ డిజైన్లు, పరిమాణాల నాణేలు చట్టబద్ధమైన చెల్లింపు సాధనాలుగా కొనసాగుతున్నాయి.

