మొక్కలకు ఎలా ఉపయోగపడుతుంది? చేపల వ్యర్థాల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు వంటి పదార్థాలు ఉంటాయి. బెల్లం పులియబెట్టే ప్రక్రియలో సూక్ష్మజీవుల కార్యకలాపాలకు సహాయపడుతుంది. దీంతో తయారైన మీనామృతం మొక్కలకు పోషకాలను అందించడంతో పాటు నేలలో జీవసంబంధ కార్యకలాపాలు పెరగడానికి, నేల సారాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

