గోధుమకు క్వింటాల్‌కు రూ.2,610. ఉత్పత్తి ఖర్చు రూ.1,264గా లెక్కించారు. ఖర్చుపై 106 శాతం మార్జిన్ ఉంటుంది. 2026-27లో MSP రూ.2,585 ఉండగా, ఇప్పుడు రూ.25 పెరిగింది. బార్లీకి క్వింటాల్‌కు రూ.2,286. ఉత్పత్తి ఖర్చు రూ.1,447. ఖర్చుపై 58 శాతం మార్జిన్ ఉంటుంది. గత ఏడాది రూ.2,150గా ఉన్న MSP ఇప్పుడు రూ.136 పెరిగింది. శనగలకు క్వింటాల్‌కు రూ.5,958. ఉత్పత్తి ఖర్చు రూ.3,751. ఖర్చుపై 59 శాతం మార్జిన్ ఉంటుంది. గత ఏడాది రూ.5,875గా ఉన్న MSP ఇప్పుడు రూ.83 పెరిగింది. ఎర్ర పప్పు క్వింటాల్‌కు రూ.7,390. ఉత్పత్తి ఖర్చు రూ.3,854. ఖర్చుపై 92 శాతం మార్జిన్ ఉంటుంది. గత ఏడాది రూ.7,000గా ఉన్న MSP ఇప్పుడు రూ.390 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)

