పెరట్లో లేదా బాల్కనీలో మందార, గులాబీ, నందివర్ధనం, మల్లె వంటి పూల మొక్కలను ఎంత అపురూపంగా పెంచుకున్నా.. ఒక్కసారి ‘తెల్ల తెగులు’ ఆశిస్తే మొక్కల అందమంతా క్షణాల్లో నాశనమవుతుందని అనుభవజ్ఞులైన వ్యవసాయ & గార్డెనింగ్ నిపుణులు మల్లన్న వివరిస్తున్నారు. దూది పింజల్లా ఆకుల అడుగున, కొమ్మల సందుల్లో, లేత మొగ్గలపై పేరుకుపోయే ఈ తెల్ల పిండి పురుగులు మొక్కల జీవ రసాన్ని పీల్చేస్తాయి.

