భారత్‌లో ఏసీ మార్కెట్ ఎంత పెద్దది?
భారతదేశ రూమ్ ఎయిర్ కండీషనర్ పరిశ్రమలో సంవత్సరానికి సుమారు 1.2 నుంచి 1.25 కోట్ల యూనిట్ల మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ విభాగంలో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పట్టణీకరణ, జీవన ప్రమాణాల్లో మార్పులు, మధ్యతరగతి ఆదాయాల పెరుగుదల వంటి కారణాలతో భారతదేశంలో ఏసీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే ధరల పెంపు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ వంటి ప్రమోషన్లు ఉన్నప్పటికీ, కొత్త ధరల కారణంగా తుది చెల్లింపు మొత్తం పెరగవచ్చు. దీంతో ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారు ధరలతో పాటు విద్యుత్ వినియోగం, స్టార్ రేటింగ్, సామర్థ్యం, వారంటీ వంటి అంశాలను కూడా పరిశీలించడం ముఖ్యంగా మారింది.(ప్రతీకాత్మక చిత్రం)

