వాట్సాప్‌లో ప్రొఫైల్ ఫొటో లేదా డీపీ అనేది కేవలం ఒక ఫొటో మాత్రమే కాదు. చాలామందికి అది తమ డిజిటల్ గుర్తింపులో ఒక భాగం. కొత్త హెయిర్‌కట్, కొత్త డ్రెస్, పుట్టినరోజు, ట్రిప్ లేదా జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన సందర్భం జరిగినప్పుడు వెంటనే డీపీ మార్చే వారు చాలామంది ఉంటారు. ఇలా డీపీ మార్చడం ద్వారా తమ జీవితంలో జరిగిన విషయాలను ఇతరులతో పంచుకోవాలని కొందరు అనుకుంటారు. అయితే అందరూ అలా ఉండరు. కొంతమంది నెలలు, సంవత్సరాలు గడిచినా ఒకే ప్రొఫైల్ ఫొటోను కొనసాగిస్తారు. అలా చేస్తే దాని వెనుక ఏదైనా ప్రత్యేకమైన సైకాలజీ ఉందా అనే సందేహం చాలామందికి వస్తుంది.

