అయితే పెరుగు మీద కొద్దిగా తేట నీరు కనిపిస్తే వెంటనే పాడైందని భావించాల్సిన అవసరం లేదు. పెరుగు రంగు, వాసన సాధారణంగానే ఉండి.. ఇతర చెడు లక్షణాలు కనిపించకపోతే ఆ నీటిని పెరుగుతో కలిపి ఉపయోగించవచ్చు. కానీ తెలుపు, ఆకుపచ్చ లేదా నలుపు రంగులో బూజు కనిపిస్తే మాత్రం పెరుగును వాడకుండా పూర్తిగా పడేయాలి. అలాగే అసాధారణంగా పుల్లటి వాసన, చెడు వాసన, రంగులో మార్పు లేదా జిగటగా, అంటుకునేలా మారిన టెక్స్చర్ కనిపించినా దాన్ని తినకపోవడం మంచిదని గృహిణి చెబుతున్నారు.

