ప్రభన్యూస్

Chiranjeevi: ‘కాకా’ ఖతర్నాక్ అప్‌డేట్.. ఇక ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగాల్సిందే | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేశారు.

News18
News18

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పండుగ రేసుకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. డబ్బింగ్ పనులు మొదలైనట్లు అధికారికంగా వెల్లడిస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’ అనే పవర్‌ఫుల్ అండ్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. అన్షురా రాజన్, నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, కన్నడ నటి రచిత రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సక్సెస్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ మరోసారి అదే పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని మేకర్స్ బరిలోకి దిగుతున్నారు. ‘కదిరి కాళిదాస్’ క్యారెక్టరైజేషన్, చిరంజీవి లుక్, డైలాగ్ డెలివరీ ఆయన వింటేజ్ మాస్ రోజులను గుర్తుచేసేలా అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాబీ మరోసారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా పక్కా కమర్షియల్ హంగులతో ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన సీజీ (VFX), ఎడిటింగ్ పనులు కూడా డబ్బింగ్‌తో పాటు సమాంతరంగా జరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు పోటీకి సిద్ధమవుతున్నప్పటికీ, మెగాస్టార్ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఎక్కడా అంచనాలు తగ్గలేదు.

అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను త్వరలోనే వేగవంతం చేయనున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ‘కాకా’ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లేదా టీజర్‌ విడుదల చేసి, అంచనాలను పెంచడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 4:24 pm Digital Edition : Prabhanews
Chiranjeevi: ‘కాకా’ ఖతర్నాక్ అప్‌డేట్.. ఇక ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగాల్సిందే | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 25, 2026 4:16 PM ISTమెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేశారు. News18మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పండుగ రేసుకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. డబ్బింగ్ పనులు మొదలైనట్లు అధికారికంగా వెల్లడిస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ నెట్టింట వైరల్‌గా మారింది.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’ అనే పవర్‌ఫుల్ అండ్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. అన్షురా రాజన్, నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, కన్నడ నటి రచిత రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సక్సెస్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ మరోసారి అదే పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని మేకర్స్ బరిలోకి దిగుతున్నారు. ‘కదిరి కాళిదాస్’ క్యారెక్టరైజేషన్, చిరంజీవి లుక్, డైలాగ్ డెలివరీ ఆయన వింటేజ్ మాస్ రోజులను గుర్తుచేసేలా అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాబీ మరోసారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా పక్కా కమర్షియల్ హంగులతో ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
The dubbing works of #KAAKA commence with a divine pooja ceremony. 🎙️✨With the shoot and post-production progressing simultaneously, the team is working at full speed to set THE BLOODY BENCHMARK 🪓🔥Worldwide Grand Release on January 13th, 2027❤️‍🔥A @dirbobby Film 💥 pic.twitter.com/NtOW1wM40y
— Teju PRO (@Teju_PRO) September 25, 2026ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన సీజీ (VFX), ఎడిటింగ్ పనులు కూడా డబ్బింగ్‌తో పాటు సమాంతరంగా జరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు పోటీకి సిద్ధమవుతున్నప్పటికీ, మెగాస్టార్ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఎక్కడా అంచనాలు తగ్గలేదు.అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను త్వరలోనే వేగవంతం చేయనున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ‘కాకా’ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లేదా టీజర్‌ విడుదల చేసి, అంచనాలను పెంచడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.మరింత చదవండి

Source link