ప్రభన్యూస్

ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం.

ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం.

​న్యూఢిల్లీలో 3వ జాతీయ ‘యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌ల సదస్సు.

​ఏపీ ఈగల్ సాధించిన విజయాలు, ఉత్తమ విధానాలను వివరించిన చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ.

​గంజాయి రహిత ఏపీ కోసం ‘ఆపరేషన్ చైతన్యం’.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ‘ఏపీ ఈగల్’ మోడల్.

​మాదకద్రవ్యాలపై సమాచారమివ్వండి.. ‘1972’ కి కాల్ చేయండి.

​డ్రగ్స్ రహిత భారతావని కోసం సమగ్ర కార్యాచరణ.

​3వ జాతీయ సదస్సులో ‘ఏపీ ఈగల్’ విశేష ప్రశంసలు.

ఢిల్లీ – స్టేట్ బ్యూరో చీఫ్ ( ప్రభ న్యూస్ ) సెప్టెంబర్ 23:-

మాదకద్రవ్యాల రహిత భారతావని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో ‘మిషన్ మోడ్’లో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో నిర్వహించిన ‘3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌ల కాన్ఫరెన్స్’లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ పాలుపంచుకున్నారు. ​దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌లు, కేంద్ర హోంశాఖ మరియు పోలీస్ విభాగాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో.. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ నియంత్రణ, నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, యువత రక్షణ, పునరావాసం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ‘ఏపీ ఈగల్’ సాధించిన విజయాలను ఐజీపీ ఆకే రవికృష్ణ సమగ్రంగా వివరించారు. ​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన "జీరో టాలరెన్స్" విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ‘ఆపరేషన్ చైతన్యం’ సాధించిన ఫలితాలను ఈ సదస్సులో ప్రదర్శించగా, పలు రాష్ట్రాల అధికారులు దీనిని "ఆంధ్రప్రదేశ్ – ఈగల్ మోడల్"గా ప్రశంసించారు. ఒడిశా రాష్ట్ర ప్రతినిధులు సైతం తమ ప్రజెంటేషన్‌లో ఈ ఆపరేషన్ చైతన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ​ఏపీ ఈగల్‌ను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు 27 అకౌంటబుల్ ఫంక్షనల్ వర్టికల్స్‌తో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మార్చి 2027 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 September 2026, 8:19 pm Digital Edition : Prabhanews
<b>ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం</b>.

ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం.

​న్యూఢిల్లీలో 3వ జాతీయ 'యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌ల సదస్సు.

​ఏపీ ఈగల్ సాధించిన విజయాలు, ఉత్తమ విధానాలను వివరించిన చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ.

​గంజాయి రహిత ఏపీ కోసం 'ఆపరేషన్ చైతన్యం'.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా 'ఏపీ ఈగల్' మోడల్.

​మాదకద్రవ్యాలపై సమాచారమివ్వండి.. '1972' కి కాల్ చేయండి.

​డ్రగ్స్ రహిత భారతావని కోసం సమగ్ర కార్యాచరణ.

​3వ జాతీయ సదస్సులో 'ఏపీ ఈగల్' విశేష ప్రశంసలు.

ఢిల్లీ - స్టేట్ బ్యూరో చీఫ్ ( ప్రభ న్యూస్ ) సెప్టెంబర్ 23:-

మాదకద్రవ్యాల రహిత భారతావని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో 'మిషన్ మోడ్'లో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో నిర్వహించిన '3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌ల కాన్ఫరెన్స్'లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ పాలుపంచుకున్నారు. ​దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌లు, కేంద్ర హోంశాఖ మరియు పోలీస్ విభాగాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో.. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ నియంత్రణ, నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, యువత రక్షణ, పునరావాసం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో 'ఏపీ ఈగల్' సాధించిన విజయాలను ఐజీపీ ఆకే రవికృష్ణ సమగ్రంగా వివరించారు. ​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన "జీరో టాలరెన్స్" విధానంలో భాగంగా రూపకల్పన చేసిన 'ఆపరేషన్ చైతన్యం' సాధించిన ఫలితాలను ఈ సదస్సులో ప్రదర్శించగా, పలు రాష్ట్రాల అధికారులు దీనిని "ఆంధ్రప్రదేశ్ – ఈగల్ మోడల్"గా ప్రశంసించారు. ఒడిశా రాష్ట్ర ప్రతినిధులు సైతం తమ ప్రజెంటేషన్‌లో ఈ ఆపరేషన్ చైతన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ​ఏపీ ఈగల్‌ను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు 27 అకౌంటబుల్ ఫంక్షనల్ వర్టికల్స్‌తో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మార్చి 2027 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.