ఫ్యాన్స్ అయితే.. థియేటర్లను భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో అందంగా ముస్తాబు చేస్తుంటారు. స్క్రీన్‌పై బిగ్‌బీ కనిపించిన ప్రతిసారీ ఈలలు, గోలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అందుకే అమితాబ్ బచ్చన్‌ను కేవలం ఒక స్టార్ హీరోగా కాకుండా ఒక శకానికి ప్రతీకగా భావిస్తారు.

