Last Updated:
సుధీర్ ని పిచ్చ తిట్లు తిట్టింది సృష్టి. సుధీర్ – త్రిగున్ కొట్టుకోడానికి రెడీ అయ్యారు. నామినేషన్స్ ఫైర్ అయితే పీక్స్ లోకి చేరింది. ఇవీ బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ హైలైట్స్.
బిగ్‌బాస్ హౌస్ అంటేనే అనూహ్య పరిణామాలు, ఆధిపత్య పోరు, ఊహించని వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి వారం జరిగే నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల అసలు రంగులు బయటపడుతుంటాయి. తాజాగా సెప్టెంబరు 21, సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ నామినేషన్ల మంటలతో దద్దరిల్లింది. మూడో వారం నామినేషన్స్ కావడంతో హౌస్మేట్స్ తమ మాస్క్‌లు తీసి గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. సుధీర్, వర్షిణి, ముఖేష్ టీం ఒకవైపు ఉంటే.. త్రిగుణ్ పై వారు చేసిన ఎదురుదాడి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక సుధీర్, సృష్టి, త్రిగుణ్ మధ్య జరిగిన త్రిముఖ పోరు బిగ్‌బాస్ ప్రేక్షకులకు అసలైన మసాలా అందించింది.
ఎపిసోడ్ ప్రారంభంలోనే బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ రూమ్ ట్విస్ట్ అదిరిపోయింది. ముకేశ్‌ని సీక్రెట్ రూమ్‌కి పిలిచిన బిగ్‌బాస్.. హౌస్ కెప్టెన్ అయిన ఝాన్సీకి సంబంధించిన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఝాన్సీ కెప్టెన్సీని లాక్కొని తాను కెప్టెన్ అవ్వడమా? లేదా ఆమెకున్న ప్రత్యేక అధికారాలు (పవర్స్) లాక్కొని ఆమెను సాధారణ కంటెస్టెంట్లా టెన్షన్ పెట్టడమా? అని అడగ్గా.. ముకేశ్ మాస్టర్ మైండ్ ఉపయోగించి రెండో ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో ఝాన్సీ తన కెప్టెన్సీ పవర్స్ కోల్పోయి డీలా పడిపోయింది.
అనంతరం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. టాస్క్‌లో పోటీపడి ఎన్విలప్లు సాధించిన వారు నామినేట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో రాంప్రసాద్.. వంశీని నామినేట్ చేశాడు. అన్నం వడ్డించే సమయంలో వంశీ ఓవర్ యాక్షన్ చేస్తూ, గట్టిగా అరుస్తున్నాడని కారణం చెప్పాడు. ఇక నామినేట్ అయిన వారిపై చెత్త వేసే ప్రక్రియ వాతావరణాన్ని మరింత హీటెక్కించింది. వంశీపై చెత్త వేయడాన్ని తప్పుబడుతూ.. ‘అన్నం పెట్టిన చేతులపైనే చెత్త వేశారు’ అంటూ త్రిగుణ్ వేసిన డైలాగ్ హౌస్‌లో సింపతీ క్రియేట్ చేసింది. ఇదే సమయంలో మానిటర్ దేబ్జానీ, వర్షిణిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు రాంప్రసాద్ తనకు వచ్చిన సెకండ్ ఛాన్స్‌ను రోహిత్‌కు ఇవ్వగా.. రోహిత్ ఏమాత్రం ఆలోచించకుండా సుధీర్‌ను టార్గెట్ చేశాడు. సుధీర్‌కు సొంత బుర్ర లేదని, కేవలం వర్షిణి చెప్పినట్లు ఆడుతూ ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడని విమర్శించాడు.
ఈ ఎపిసోడ్లో అన్నింటికంటే సంచలనం రేపిన అంశం సృష్టి, సుధీర్ల మధ్య జరిగిన ఫుట్. హౌస్‌లో వీరిద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోందనే పుకార్లపై సృష్టి రగిలిపోయింది. కేవలం ఫుటేజ్, కంటెంట్ కోసమే సుధీర్ తనను వాడుకుంటున్నాడని త్రిగుణ్ చెప్పడంతో సృష్టికి కోపం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో సుధీర్ కల్పించుకుని “నాకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది” అని సెటైరికల్ గా కామెంట్ చేయడంతో సృష్టి శివంగిలా విరుచుకుపడింది. “నేనేమైనా నీ వెనుక పడ్డానా? నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే పళ్లు రాలగొడతా” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన సృష్టి, షాలిని దగ్గర కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏదేమైనా మూడో వారం నామినేషన్లు హౌస్‌లోని పాత బంధాలను తుంచేసి, కొత్త శత్రుత్వాలకు నాంది పలికాయని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బిగ్‌బాస్ ఆట మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

