మటన్ పాయా సాధారణంగా మటన్ కాళ్లు, ఎముకలు, చర్మం, కొవ్వు వంటి భాగాలతో తయారు చేస్తారు. వీటిని ఎక్కువసేపు ఉడికించడం వల్ల పాయా చిక్కగా, రుచిగా తయారవుతుంది. ఇందులో కొల్లాజెన్, జెలటిన్ వంటి పదార్థాలు ఉంటాయి. అయితే పాయా తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని లేదా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. పాయాలో ఉండే కొవ్వు పరిమాణం తయారీ విధానం, ఉపయోగించే మాంసం భాగాలు, పైకి తేలే కొవ్వు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

