బాత్రూమ్లో విద్యుత్ షాక్.. 12 ఏళ్ల విద్యార్థిని మృతి
పెనుకొండ , ప్రభ న్యూస్ , సెప్టెంబర్ 21 :
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం మారుతినగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టిన సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై దామిని (12) అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది.
స్నానం చేసేందుకు దామిని బకెట్లో హీటర్ పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె చేతిలోని బ్రష్ ప్రమాదవశాత్తూ బకెట్లో పడిపోయింది. దాన్ని తీసుకునేందుకు బకెట్లో చేయి పెట్టడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుత్ షాక్తో దామిని అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కుమార్తెను కోల్పోయిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.
ఈ ఘటనతో మారుతినగర్లో విషాద వాతావరణం నెలకొంది. బకెట్లో నీటిని వేడి చేసేందుకు విద్యుత్ హీటర్లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

