ప్రభన్యూస్

Kaaka Movie: ‘కాకా’ టైటిల్ వెనుక అసలు అర్థం వేరేనా?.. బాబోయ్ మెగాస్టార్ మాములోడు కాదు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి బాబీతో కలిసి పనిచేస్తున్న చిరంజీవి.. ఈసారి కూడా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. చాలా సింపుల్‌గా ‘కాకా’ అనే టైటిల్‌ను ప్రకటించినప్పటికీ.. ఆ టైటిల్ వెనుక ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదటి నుంచే ఉంది. అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముందే చిరంజీవి ‘కదిరి’ అంటూ చిన్న లీక్ ఇవ్వడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ తర్వాత మేకర్స్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ‘కాకా’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో.. చిరంజీవి చెప్పిన ‘కదిరి’కి, ‘కాకా’ టైటిల్‌కు సంబంధం ఏంటి అనే చర్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ స్వయంగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ‘కాకా’ అంటే ‘కదిరి కాళిదాస్’ అని చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లుగా ‘కాకా’ టైటిల్ వెనుక ఉన్న అర్థం ఇదేనా అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ స్వయంగా చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. మేకర్స్ కూడా దీనిని షేర్ చేయడంతో ‘కాకా’ టైటిల్‌కు సంబంధించిన అసలు అర్థం ఇదేనని స్పష్టత వచ్చింది. ఇక సినిమాలో చిరంజీవి పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్’ కావడంతో.. టైటిల్ కూడా దాని షార్ట్ ఫామ్‌గా ‘కాకా’ అని పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో టైటిల్ వెనుక ఇంత సింపుల్‌గా, క్యాచీగా ఒక అర్థాన్ని పెట్టారా అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై కూడా ఇప్పటికే పలు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా రిలీజ్ డేట్‌పై ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి ‘కాకా’ అనే చిన్న టైటిల్ వెనుక ‘కదిరి కాళిదాస్’ అనే పూర్తి పేరు ఉందని చిరంజీవి స్వయంగా లీక్ చేయడంతో ఇప్పుడు సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సంక్రాంతి బరిలో ఈ మెగాస్టార్ మాస్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 3:28 pm Digital Edition : Prabhanews
Kaaka Movie: ‘కాకా’ టైటిల్ వెనుక అసలు అర్థం వేరేనా?.. బాబోయ్ మెగాస్టార్ మాములోడు కాదు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 20, 2026 3:24 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.News18టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి బాబీతో కలిసి పనిచేస్తున్న చిరంజీవి.. ఈసారి కూడా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. చాలా సింపుల్‌గా ‘కాకా’ అనే టైటిల్‌ను ప్రకటించినప్పటికీ.. ఆ టైటిల్ వెనుక ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదటి నుంచే ఉంది. అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముందే చిరంజీవి ‘కదిరి’ అంటూ చిన్న లీక్ ఇవ్వడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ తర్వాత మేకర్స్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ‘కాకా’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో.. చిరంజీవి చెప్పిన ‘కదిరి’కి, ‘కాకా’ టైటిల్‌కు సంబంధం ఏంటి అనే చర్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ స్వయంగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ‘కాకా’ అంటే ‘కదిరి కాళిదాస్’ అని చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లుగా ‘కాకా’ టైటిల్ వెనుక ఉన్న అర్థం ఇదేనా అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ స్వయంగా చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. మేకర్స్ కూడా దీనిని షేర్ చేయడంతో ‘కాకా’ టైటిల్‌కు సంబంధించిన అసలు అర్థం ఇదేనని స్పష్టత వచ్చింది. ఇక సినిమాలో చిరంజీవి పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్’ కావడంతో.. టైటిల్ కూడా దాని షార్ట్ ఫామ్‌గా ‘కాకా’ అని పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో టైటిల్ వెనుక ఇంత సింపుల్‌గా, క్యాచీగా ఒక అర్థాన్ని పెట్టారా అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై కూడా ఇప్పటికే పలు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా రిలీజ్ డేట్‌పై ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి ‘కాకా’ అనే చిన్న టైటిల్ వెనుక ‘కదిరి కాళిదాస్’ అనే పూర్తి పేరు ఉందని చిరంజీవి స్వయంగా లీక్ చేయడంతో ఇప్పుడు సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సంక్రాంతి బరిలో ఈ మెగాస్టార్ మాస్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.మరింత చదవండి

Source link