సూర్య శక్తి సోలార్ ఫైనాన్స్ పేరుతో ఎస్‌బీఐ సమగ్ర ఆర్థిక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఈ లోన్ సదుపాయం లభిస్తుంది. రూఫ్ టాప్ అంటే భవనాల మీద, గ్రౌండ్ మౌంటెడ్ అంటే నేల మీద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ పథకం కింద లోన్లు ఇస్తారు. ముఖ్యంగా క్యాప్టివ్ వేరియంట్ అంటే సొంత అవసరాల కోసం, హౌసింగ్ సొసైటీల కోసం, ఇతర క్యాప్టివ్ ప్రాజెక్ట్స్ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా పవర్ సేల్స్ చేసే వారి కోసం దీనిని రూపొందించారు. “ఎస్‌బీఐ సోలార్ లోన్ ద్వారా వ్యాపారులకు కనీసం రూ.10 లక్షల నుంచి రుణాలు ఇస్తున్నాం. సాధారణంగా వడ్డీ 9 శాతం ఉంటుంది. ఇందులో 4 శాతం వడ్డీ సబ్సిడీ వస్తుంది. అంటే కస్టమర్ చెల్లించాల్సింది కేవలం 5 శాతం మాత్రమే” అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలైజ్డ్ ఎస్ఎస్ఐ బాలానగర్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్, ఓం స్వరూప్ షగన్ తెలిపారు. 25వ సీఐఐ ఎనర్జీ ఎఫీషియెంట్ సమ్మిట్ ఈవెంట్‌లో న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ ఈ స్కీమ్ గురించి వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

