చాలారోజులుగా చర్చ జరుగుతున్నట్టుగానే యూపీఐపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ఛార్జీలను ప్రకటించింది. రూ.2,000 పైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను ప్రకటించింది. రూ.2,000 దాటే పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు ఉంటాయి. అయితే రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్లకు MDR గరిష్ఠంగా రూ.300కే పరిమితం అవుతుంది. అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు ఉండవు. అంటే మీరు యూపీఐ ద్వారా మరో వ్యక్తికి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇన్సూరెన్స్, ఫ్యూయల్, రైల్వేలు, టెలికాం, యుటిలిటీ బిల్లులు, విద్యా సంస్థలు వంటి రంగాలకు ప్రత్యేక రాయితీలు ఉండటం మరో ముఖ్యమైన అంశం. ఈ రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులకు కొన్ని సందర్భాల్లో 0.4% శాతం ఆధారిత MDRకు బదులుగా రూ.5 ఫ్లాట్ ఛార్జీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

