ప్రభన్యూస్

Youtuber Rama Nandana: లుకౌట్ నోటీసులు రద్దు చేయండి, తిరిగి లండన్ వెళ్లిపోతా.. నందన కేసులో కీలక మలుపు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ (Nandu’s World) ఛానల్ నిర్వాహకురాలు రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులకు కీలక విజ్ఞప్తి చేసింది. ఆ వివరాలు చూస్తే..

News18
News18

ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ (Nandu’s World) ఛానల్ నిర్వాహకురాలు రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ముందస్తుగా జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆమె ఈ నెల 16న పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా తన న్యాయవాదుల సలహా మేరకు ఒకరోజు ముందుగానే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణలో పాల్గొన్నారు.

లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని వినతి:

విచారణ సందర్భంగా రమానందన పోలీసుల ముందు ఒక కీలక అభ్యర్థన ఉంచారు. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (LOC)ను వెంటనే ఎత్తివేయాలని, తాను తిరిగి లండన్ వెళ్లేందుకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా, గత విచారణలో పోలీసులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు ఆమె న్యాయవాది సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానాలు అందజేసినట్లు సమాచారం. తనపై మోపిన కేసులో వాస్తవం లేదని, కాబట్టి తనను లండన్ వెళ్లేందుకు అనుమతించాలని ఆమె కోరారు.

నాకేం తెలియదు.. అంతా నా భర్తదే బాధ్యత:

‘డెస్టినీ కన్సల్టెన్సీ’ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని రమానందన పోలీసులకు స్పష్టం చేశారు. ఆ కన్సల్టెన్సీ వ్యవహారాలు, వీసాలు, స్పాన్సర్‌షిప్ ఫీజులకు సంబంధించిన విషయాలన్నీ తన భర్త మధుకర్, అలాగే అతడి అకౌంటెంట్ మాత్రమే చూసుకుంటారని దర్యాప్తు అధికారులకు తెలిపారు. తన భర్త మధుకర్ లండన్ నుంచి ఇండియాకు రాగానే, అతడినే నేరుగా విచారించాలని ఆమె పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా, రమానందన చేసిన ఎన్‌వోసీ (NOC) అభ్యర్థనపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా, ఇబ్రహీంపట్నం పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. న్యాయ సలహా ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

అసలేం జరిగిందంటే..?

డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అందిస్తామని నమ్మించి రమానందన దంపతులు భారీగా డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రాంతికుమార్ అనే బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్నట్లు భావించి పోలీసులు రమానందనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

దీని ఆధారంగా గత నెలలో ఆమె లండన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అప్పట్లో (గత నెల 8న) ఆమెను విచారించిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు ఇవ్వడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 10:03 am Digital Edition : Prabhanews
Youtuber Rama Nandana: లుకౌట్ నోటీసులు రద్దు చేయండి, తిరిగి లండన్ వెళ్లిపోతా.. నందన కేసులో కీలక మలుపు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 16, 2026 9:53 AM ISTయూట్యూబర్, 'నందూస్ వరల్డ్' (Nandu's World) ఛానల్ నిర్వాహకురాలు రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులకు కీలక విజ్ఞప్తి చేసింది. ఆ వివరాలు చూస్తే.. News18ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' (Nandu's World) ఛానల్ నిర్వాహకురాలు రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ముందస్తుగా జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆమె ఈ నెల 16న పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా తన న్యాయవాదుల సలహా మేరకు ఒకరోజు ముందుగానే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణలో పాల్గొన్నారు.లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని వినతి:విచారణ సందర్భంగా రమానందన పోలీసుల ముందు ఒక కీలక అభ్యర్థన ఉంచారు. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (LOC)ను వెంటనే ఎత్తివేయాలని, తాను తిరిగి లండన్ వెళ్లేందుకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా, గత విచారణలో పోలీసులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు ఆమె న్యాయవాది సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానాలు అందజేసినట్లు సమాచారం. తనపై మోపిన కేసులో వాస్తవం లేదని, కాబట్టి తనను లండన్ వెళ్లేందుకు అనుమతించాలని ఆమె కోరారు.నాకేం తెలియదు.. అంతా నా భర్తదే బాధ్యత:'డెస్టినీ కన్సల్టెన్సీ' ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని రమానందన పోలీసులకు స్పష్టం చేశారు. ఆ కన్సల్టెన్సీ వ్యవహారాలు, వీసాలు, స్పాన్సర్‌షిప్ ఫీజులకు సంబంధించిన విషయాలన్నీ తన భర్త మధుకర్, అలాగే అతడి అకౌంటెంట్ మాత్రమే చూసుకుంటారని దర్యాప్తు అధికారులకు తెలిపారు. తన భర్త మధుకర్ లండన్ నుంచి ఇండియాకు రాగానే, అతడినే నేరుగా విచారించాలని ఆమె పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా, రమానందన చేసిన ఎన్‌వోసీ (NOC) అభ్యర్థనపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా, ఇబ్రహీంపట్నం పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. న్యాయ సలహా ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.అసలేం జరిగిందంటే..?డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అందిస్తామని నమ్మించి రమానందన దంపతులు భారీగా డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రాంతికుమార్ అనే బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్నట్లు భావించి పోలీసులు రమానందనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.దీని ఆధారంగా గత నెలలో ఆమె లండన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అప్పట్లో (గత నెల 8న) ఆమెను విచారించిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు ఇవ్వడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.మరింత చదవండి

Source link