లైవ్ మింట్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ కీలకమైన న్యాయపోరాటం ఒక హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన వెంకటేశన్ అనే సహభాగస్వామి (Coparcener) ఆస్తి వివాదానికి సంబంధించింది. వెంకటేశన్ అకాల మరణం చెందిన తర్వాత, ఆయన భార్య మరొకరిని వివాహం చేసుకుంది. అయితే, ఆమె తన మొదటి భర్త అయిన వెంకటేశన్ ఆస్తిలో ఎలాంటి హక్కులను గానీ, వాటాను గానీ కోరలేదు. ఈ నేపథ్యంలో, వెంకటేశన్కు ఏకైక మొదటి తరగతి వారసురాలిగా ఉన్న ఆయన కుమార్తె, తండ్రికి రావలసిన మొత్తం సహభాగస్వామ్య హక్కులను చట్టబద్ధంగా వారసత్వంగా పొంది, ఆ ఆస్తిని సర్వహక్కులతో నిర్వహించడం ప్రారంభించింది.(AI IMAGE)

