Last Updated:
కడుపు నొప్పితో పాటు పొత్తికడుపులో గడ్డ లేదా వాపు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది హెర్నియాకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా నొప్పి పదేపదే రావడం, దగ్గినప్పుడు లేదా బరువైన వస్తువులు ఎత్తినప్పుడు నొప్పి పెరగడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, కండరాల నొప్పి వంటి ఎన్నో కారణాల వల్ల ఇవి రావచ్చు. అయితే కడుపు నొప్పితో పాటు పొత్తికడుపులో గడ్డ లేదా వాపు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది హెర్నియాకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా నొప్పి పదేపదే రావడం, దగ్గినప్పుడు లేదా బరువైన వస్తువులు ఎత్తినప్పుడు నొప్పి పెరగడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

