Last Updated:
BRICS 2026: ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాల మధ్య వాణిజ్య, తయారీ బంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శనివారం న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది.
ఇందులో భాగంగా పటిష్టమైన అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల (సప్లై చైన్ రెసిలియెన్స్) నిర్మాణంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2003లో 84 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్గత బ్రిక్స్ వస్తు వాణిజ్యం, 2024 నాటికి ఏకంగా 13 రెట్లు పెరిగి 1.17 ట్రిలియన్ డాలర్లకు చేరిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాలు దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయని, సభ్య దేశాలన్నీ విభిన్న సరఫరా మార్గాలను ప్రోత్సహించాలని సదస్సుకు ముందు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) మార్కెట్లలో చైనాకు ప్రత్యామ్నాయంగా నిలిచే ‘చైనా ప్లస్ వన్’ గమ్యస్థానంగా భారత్ ఎదగగలదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

