Last Updated:
జియోఫైనాన్స్ యాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చేశాయి. జియోఫైనాన్స్+ ద్వారా అర్హత ఉన్న లావాదేవీలపై వ్యాల్యూ-బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)కు పూర్తిగా అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ అండ్ సర్వీస్ లిమిటెడ్ (JFPSL), జియోఫైనాన్స్ యాప్‌లో జియోఫైనాన్స్+ (JioFinance+)తో పాటు జియోఫైనాన్స్360 (JioFinance360)ను ప్రారంభించింది. కస్టమర్లు తమ ఆర్థిక ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, దాన్ని మెరుగుపర్చుకునేందుకు ఈ రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. అలాగే జియోఫైనాన్స్ ప్లాట్‌ఫామ్‌లో చేసే అర్హత ఉన్న ప్రతి లావాదేవీపై మరిన్ని రివార్డులు పొందే అవకాశం కల్పిస్తున్నారు.

