మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు నిజంగా ఎంత స్వచ్ఛమైనవో తెలుసుకోవాలనుకుంటున్నారా? అది వారసత్వంగా వచ్చిన నగలైనా, ఇటీవల కొనుగోలు చేసిన ఆభరణం అయినా ఇప్పుడు బంగారం స్వచ్ఛతను అధికారికంగా పరీక్షించుకోవచ్చు. బీఐఎస్ గుర్తింపు పొందిన అసేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్లలో (ఏహెచ్‌సీ) హాల్‌మార్క్ ఉన్న, లేని బంగారు ఆభరణాలను పరీక్షించుకునే సదుపాయం ఉంది. నిర్ణీత నాణ్యతా పరీక్షల ద్వారా ఈ కేంద్రాలు బంగారం స్వచ్ఛతపై నమ్మకమైన ఫలితాలను అందిస్తాయి. దీంతో మీ ఆభరణం నిజంగా ఎంత స్వచ్ఛమైనదో, అది బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోతుందో తెలుసుకోవచ్చు. బీఐఎస్ గుర్తింపు పొందిన అసేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్లలో బంగారు ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించుకోవచ్చని, హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలకే కాదు, హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలకు కూడా ఈ సదుపాయం ఉందని, అంటే ఇంట్లో చాలాకాలంగా ఉన్న పాత కుటుంబ నగలు, వాటి స్వచ్ఛతపై అనుమానం ఉన్న ఆభరణాలు కూడా పరీక్షించుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెబుతోంది. (image: AI Generated)

