అక్టోబర్ 8 అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులతో పాటు కో-బ్రాండెడ్ కార్డులు ఉన్నవారికి ఎర్లీ యాక్సెస్ సేల్ ప్రారంభమైంది. ఈ సమయంలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెద్ద గృహోపకరణాలు, బ్యూటీ ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్, హోమ్ ప్రొడక్ట్స్ విభాగాల్లో కలిపి 28.7 కోట్లకు పైగా సెషన్లు నమోదయ్యాయి. సేల్ మొదటి గంటలో వచ్చిన సందర్శనల్లో దాదాపు సగం మంది టైర్-3 పట్టణాలు, అంతకంటే చిన్న ప్రాంతాల నుంచి వచ్చినవారేనని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. సేల్ ప్రారంభంలో పంజాబ్‌లోని సర్దూల్గఢ్, పశ్చిమ బెంగాల్‌లోని పాన్స్కురా, బిహార్‌లోని షేఖ్‌పురా, కిషన్‌గంజ్ ప్రాంతాల్లో అమ్మకాలు వేగంగా పెరిగాయి.
మొబైల్స్ విభాగంలో ప్రీమియం, ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లకు మంచి డిమాండ్ కనిపించింది. ప్రతి నలుగురు కస్టమర్లలో ఒకరు పాత ఫోన్‌ను ఇచ్చి కొత్త ఫోన్ కొనుగోలు చేసే ఎక్స్ఛేంజ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ధరలకే అందుబాటులో ఉంచిన ఎంట్రీ లెవల్ 5జీ ఫోన్లను కూడా ఎక్కువ మంది కొనుగోలు చేసినట్టు కంపెనీ తెలిపింది. పెద్ద గృహోపకరణాల విభాగంలోనూ అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే సేల్ మొదటి గంటలో ఈ విభాగం అమ్మకాలు 30 శాతం వృద్ధి చెందాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లకు మంచి డిమాండ్ వచ్చింది. ట్యాబ్లెట్ల అమ్మకాలు ఏకంగా 73 శాతం పెరిగాయి.
బ్యూటీ ఉత్పత్తుల అమ్మకాలు 42 శాతం పెరిగాయి. ముఖ్యంగా పురుషుల గ్రూమింగ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు ఎక్కువ ఆదరణ లభించింది. డిమాండ్ అత్యధికంగా ఉన్న సమయంలో ప్రతి నిమిషానికి 1,600కు పైగా పురుషుల పెర్ఫ్యూమ్లను ఫ్లిప్‌కార్ట్ విక్రయించింది. జెన్ జీ కస్టమర్లలోనూ బ్యూటీ ఉత్పత్తులు, వాచీలకు మంచి డిమాండ్ కనిపించింది. ఈ విభాగంలో బ్యూటీ ఉత్పత్తుల అమ్మకాలు 48 శాతం పెరగగా, వాచీల అమ్మకాలు 42 శాతం వృద్ధి చెందాయి. ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో స్నీకర్స్, పెర్ఫ్యూమ్స్, స్కిన్‌కేర్ ఉత్పత్తులు, క్రియేటిన్, జీన్స్‌ను ఎక్కువ మంది సెర్చ్ చేశారు.
త్వరిత డెలివరీ సేవ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌కు కూడా భారీ స్పందన వచ్చింది. సాధారణ రోజులతో పోలిస్తే ఆర్డర్లు 3.5 రెట్లు పెరిగాయి. సేల్ మొదటి గంటలో కొత్త కస్టమర్ల సంఖ్య ఏకంగా 11 రెట్లు పెరిగింది. రోజువారీ అవసరాల వస్తువులకే కాకుండా ప్రీమియం ఎలక్ట్రానిక్స్, గ్రూమింగ్ ఉత్పత్తులు, ధరించగలిగే స్మార్ట్ పరికరాల కొనుగోళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. టైర్-2, అంతకంటే పెద్ద పట్టణాలు ఈ సేవలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లుగా నిలిచాయి. ఎర్లీ యాక్సెస్ సమయంలో ఢిల్లీలోని ఓ కస్టమర్‌కు ఐఫోన్ 17ను ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా కేవలం 3.4 నిమిషాల్లోనే డెలివరీ చేసినట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్ ఫ్రయ్యర్లు, ల్యాప్‌టాప్‌లు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు కూడా ఎక్కువగా అమ్ముడైన ఉత్పత్తుల్లో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ వీడియో, లైవ్ షాపింగ్ కార్యక్రమాలకూ మంచి స్పందన వచ్చింది. ఎర్లీ యాక్సెస్ సమయంలో 1,000 గంటలకు పైగా లైవ్ కామర్స్ కార్యక్రమాలు, 5 లక్షలకు పైగా షార్ట్ వీడియోలు అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా 1.27 కోట్ల మంది వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ వీడియో, లైవ్ షాపింగ్ అనుభవాలను వీక్షించినట్టు కంపెనీ వెల్లడించింది. విక్రేతలకు కూడా ఈ సేల్ మంచి అవకాశంగా మారింది. ఎర్లీ యాక్సెస్ రోజున లావాదేవీలు నిర్వహించిన విక్రేతల్లో 51 శాతం మంది సాధారణ రోజులతో పోలిస్తే రెండింతల అమ్మకాల వృద్ధిని నమోదు చేశారు. టైర్-2, అంతకంటే పెద్ద పట్టణాలు, చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలకు చెందిన విక్రేతల అమ్మకాలు 2.9 రెట్లు పెరిగాయి. మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని పానిపట్, తమిళనాడులోని తిరుప్పూర్, హర్యానాలోని హిసార్ ప్రాంతాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్ భౌగోళిక ప్రాంతాలతో పాటు వివిధ వయసులు, వర్గాలకు చెందిన కస్టమర్లను ఎక్కువగా చేరుకున్న సేల్‌గా నిలిచిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. చిన్న పట్టణాల నుంచి వస్తున్న డిమాండ్, కొత్త కస్టమర్ల పెరుగుదల, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ వంటి కొనుగోలు సదుపాయాల వినియోగం ఈ సేల్‌లో ముఖ్యంగా కనిపించాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు వివిధ విభాగాల్లో కొనుగోళ్లు పెరగడం, ఆన్లైన్ షాపింగ్ దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తోందని సూచిస్తోంది.
