ఈ సేవను తమ ఫీచర్ ఫోన్లలో ముందుగానే అందించేందుకు ఫోన్‌పే నోకియా, హెచ్‌ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఇటెల్ మొబైల్ (ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్) వంటి హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. “ఫోన్‌పే యూపీఐ 123పే ద్వారా ఫీచర్ ఫోన్లకు యూపీఐని తీసుకురావడం వల్ల స్మార్ట్‌ఫోన్లకే పరిమితమైన డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలు దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరతాయి” అని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి “తర్వాతి 30 కోట్ల మంది వినియోగదారులను” తీసుకురావడం ద్వారా ఆర్థిక సేవలు అందరికీ చేరేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
