ఎక్స్‌ఈవీ 9ఎస్‌ను మొదటి నుంచి ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పైనే ప్రత్యేకంగా రూపొందించారు. ఎక్కువ స్థలం, సౌకర్యం, ఆధునిక టెక్నాలజీ కలిపి అందించేలా దీన్ని తయారు చేశారు. పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి 6 సీటర్, 7 సీటర్ ఎస్‌యూవీగా మహీంద్రా దీన్ని పేర్కొంది. పెద్ద కుటుంబాలు, ప్రయాణాలు ఇష్టపడేవారు, రోజూ ఎక్కువమంది కలిసి ప్రయాణించాల్సిన వారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ కారులో రెండు రకాల సీటింగ్ ఆప్షన్లు ఉన్నాయి. రెండో వరుసలో సీట్లను ముందుకు, వెనక్కి జరుపుకునే సౌకర్యంతో 7 సీటర్ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే మధ్య వరుసలో సౌకర్యవంతమైన కెప్టెన్ సీట్లు ఉండే 6 సీటర్ వెర్షన్‌ను తీసుకోవచ్చు. ఈ 6 సీటర్ ఆప్షన్ ప్యాక్ టూ అబోవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబోవ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని కోసం కొంత అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. (image: Mahindra)

