Last Updated:
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద 8K డిజిటల్ అవుట్-ఆఫ్-హోమ్ (DOOH) స్క్రీన్ ఉందని మీకు తెలుసా? ఈ భారీ డిజిటల్ డిస్ప్లేతో ఎంత ఆదాయం వచ్చిందో తెలుసుకుందాం పదండి…
డిజిటల్ ప్రకటనల రంగంలో హైదరాబాద్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న నానక్‌రామ్‌గూడలోని SAS iTower వద్ద దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అవుట్-ఆఫ్-హోమ్ (DOOH) డిస్ప్లేను Iconic by ONE VISION సంస్థ ప్రారంభించింది. వ్యవస్థాపకుడు అభినవ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ భారీ డిజిటల్ స్క్రీన్‌తో భారతీయ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొన్నాయని సంస్థ తెలిపింది.

