అమెజాన్ తన అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవ అమెజాన్ నౌను భారతదేశవ్యాప్తంగా 120కి పైగా నగరాలకు వేగంగా విస్తరించినట్లు ఈరోజు ప్రకటించింది. కేవలం రెండు వారాల్లోనే ఈ సేవ పరిధి రెట్టింపైంది. తెలంగాణలో సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, షాద్‌నగర్, మంచిర్యాలలో, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడప, ఒంగోలు, కర్నూలు, రాజమండ్రి, నరసరావుపేట, ప్రొద్దుటూరు, తెనాలి, ధర్మవరం, నంద్యాల అమెజాన్ నౌ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అమృత్‌సర్, అబోహర్, జలంధర్, అంబాలా, మంగళూరు, మణిపాల్, వైజాగ్, కొచ్చి, చంగనస్సేరి, భువనేశ్వర్, కార్వార్ వంటి నగరాల్లోని వినియోగదారులకు అమెజాన్ నౌ ద్వారా నిమిషాల్లోనే డెలివరీ ప్రారంభమైంది. ఈ సేవ పదుల వేల సంఖ్యలో రోజువారీ నిత్యావసర వస్తువుల విస్తృత ఎంపికను అందిస్తోంది. కిరాణా సరుకులు (పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్‌తో సహా), పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ నుంచి చిన్న గృహోపకరణాలు, హోమ్, కిచెన్ ఉత్పత్తుల వరకు మరెన్నో. దాదాపు 800 మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్, అర్బన్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా ఈ ఆర్డర్లను పూర్తి చేస్తున్నారు.
