Last Updated:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ వారం రిలీజ్ కాబోతున్న రణబాలి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు అక్టోబర్ 16 వస్తుందా అని టాలీవుడ్ సినీ ప్రియులు వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్.. అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. మరీ ముఖ్యంగా రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ మాత్రం ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా రష్మిక గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తనకు ఇష్టమైన కో-స్టార్ రష్మికనేనని విజయ్ వెల్లడించారు.
రష్మికతో కలిసి ఇప్పటికే మూడు సినిమాలు చేశానని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రతి సినిమాతో ఆమె నటిగా, వ్యక్తిగా మరింత ఎదుగుతోందని ప్రశంసించారు. రష్మిక పని చేసే విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని, ఒక రోబోలా నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఆమె ఎదుగుదలను చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ‘రణబాలి’ సినిమాలో రష్మిక పోషించిన జయమ్మ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందని కొనియాడారు.
‘రణబాలి’ సినిమాను పండుగ వాతావరణంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని విజయ్ పేర్కొన్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఎంతో పరిశోధన చేశారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జాతరలు, బుర్రకథలు వంటి అంశాలను పరిశీలించి, చరిత్రలో మరుగునపడిపోయిన ఒక కీలక అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు.
సుమారు 150 ఏళ్ల క్రితం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు ఏర్పడిందని, ఆ సమయంలో బ్రిటిష్ పాలకుల దురాగతాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని విజయ్ దేవరకొండ గుర్తుచేశారు. ఈ విషాద చరిత్రను సినిమాలో చూపించామని తెలిపారు. ప్రస్తుతం కూడా ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్, ఆహార ధాన్యాలను వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలని పిలుపునిచ్చారు.
గతంలో ‘నోటా’ సినిమా పరాజయం పాలైన తర్వాత అభిమానులకు ఒక మాట ఇచ్చానని విజయ్ గుర్తుచేసుకున్నారు. తిరిగి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అప్పట్లో చెప్పానని, ఇప్పుడు ‘రణబాలి’తో ఆ మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
సినిమా నిర్మాణంలో భాగమైన నిర్మాతలు రవిశంకర్, నవీన్‌కు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత అనంతపురంలో ప్రేక్షకులను కలుసుకుందామని అభిమానులతో అన్నారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ‘రణబాలి’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

