ఇవి కాకుండా గత నెలలో మహీంద్రా థార్ 10,669 యూనిట్లు, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ 10,063 యూనిట్లు, మారుతి సుజుకి విక్టోరిస్ 10,035 యూనిట్లు, మారుతి సుజుకి బ్రెజ్జా 9,939 యూనిట్లు, కియా సెల్టోస్ 9,654 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా చూస్తే, భారత మార్కెట్లో కాంపాక్ట్, మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఇంకా బలంగానే కొనసాగుతోంది. మంచి సేఫ్టీ ఫీచర్లు, మైలేజ్, అందుబాటు ధర, ఆధునిక టెక్నాలజీ ఉన్న మోడళ్లనే వినియోగదారులు ఎక్కువగా ఎంచుకుంటున్నారని జూన్ 2026 సేల్స్ గణాంకాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

