Last Updated:
Tomato Chutney: నాటు టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రతో అచ్చం పల్లెటూరి రుచిలో టమాట రోటి పచ్చడిని ఇలా తయారు చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి రుచి అదిరిపోతుంది.
Tomato Chutney: తెలుగువారి భోజనంలో పచ్చళ్లకు ఉండే స్థానమే వేరు. అందులోనూ నోటికి కారంగా, పుల్లగా తగిలే సంప్రదాయ టమాట రోటి పచ్చడి ఉంటే పక్కన ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసి అన్నం మొత్తం దాంతోనే తినేస్తారు. అయితే చాలామంది చేసేటప్పుడు టమాటాల్లోని నీరు ఎక్కువగా ఉండి పచ్చడి రుచి తగ్గడం లేదా నిల్వ ఉండకపోవడం జరుగుతుంటుంది. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఘుమఘుమలతో అచ్చం పల్లెటూరి రోటి పచ్చడి రుచి వచ్చేలా టమాట చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

