ప్రభన్యూస్

Sreemukhi: మెగా మేనల్లుడికి ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. సాయి తేజ్ రియాక్షన్ ఏంటంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ యాంకర్ శ్రీముఖి, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కి సరదాగా ప్రపోజ్ చేసిన సంఘటన ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News18
News18

యంగ్ యాంకర్ శ్రీముఖి, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కి సరదాగా ప్రపోజ్ చేసిన సంఘటన ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో జరిగిన ఈ ఫన్నీ ప్రాంక్ కాల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోకి ప్రత్యేక అతిథిగా హాజరై, తన సింగర్స్‌తో కలిసి మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇటీవల కాలంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు బుల్లితెర వేదికలపై కాన్సర్ట్‌లు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న క్రమంలో థమన్ ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు.

ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి, యాదమ్మ రాజులతో కలిసి ఈ షోను హోస్ట్ చేస్తున్న శ్రీముఖి.. మాటల మధ్యలో థమన్‌ను ఇండస్ట్రీలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని ప్రశ్నించారు. అఖిల్, సాయి ధరమ్ తేజ్ పేర్లను థమన్ చెప్పగా, వెంటనే తేజ్‌కు కాల్ చేసి లక్ష రూపాయలు అప్పు అడగాలని శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. శ్రీముఖి సూచనతో థమన్ కాల్ చేసి.. “నువ్వు నా ఫ్రెండ్‌వేనా? నాకు అర్జెంట్‌గా లక్ష రూపాయలు కావాలి, రేపు ఉదయం తిరిగి ఇచ్చేస్తాను” అని అడిగాడు. దానికి తేజ్ “ఇంత ఫాస్ట్‌గా ఎలా ఇచ్చేస్తావురా?” అని ఆశ్చర్యంగా అడిగాడు. ఈ సంభాషణ జరుగుతుండగా శ్రీముఖి వెనుక నుంచి థమన్‌కు మెల్లగా ప్రాంప్టింగ్ ఇస్తుండటంతో, ఫోన్‌లో అమ్మాయి గొంతు పసిగట్టిన తేజ్ “ఆ అమ్మాయి ఎవరు?” అని ప్రశ్నించాడు.

“స్మెల్ కూడా పట్టేస్తావా? ఇక్కడొక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా?” అని థమన్ అడగగా.. శ్రీముఖి వెంటనే ఫోన్ తీసుకుని “హాయ్ అండి.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా మీ కండలంటే మరీ ఇష్టం” అంటూ సరదాగా ప్రపోజ్ చేసింది. దీనికి సాయి ధరమ్ తేజ్ ఏమాత్రం తడుముకోకుండా “నాకంటే మా వాడి (థమన్) కండలు ఇంకా బాగుంటాయండి” అంటూ స్పాంటేనియస్‌గా కౌంటర్ ఇవ్వడంతో షోలో నవ్వులు పూశాయి.

‘పటాస్’ షోతో కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి, తనదైన టైమింగ్‌తో ఈవెంట్‌ను రక్తికట్టించింది. మరోవైపు ‘విరూపాక్ష’, ‘బ్రో’ విజయాల తర్వాత సాయి ధరమ్ తేజ్ లైనప్ బలంగా ఉంది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన తేజ్‌తో శ్రీముఖి చేసిన ఈ చిలిపి సంభాషణ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 4:48 pm Digital Edition : Prabhanews
Sreemukhi: మెగా మేనల్లుడికి ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. సాయి తేజ్ రియాక్షన్ ఏంటంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 24, 2026 4:46 PM ISTప్రముఖ యాంకర్ శ్రీముఖి, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కి సరదాగా ప్రపోజ్ చేసిన సంఘటన ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. News18యంగ్ యాంకర్ శ్రీముఖి, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కి సరదాగా ప్రపోజ్ చేసిన సంఘటన ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో జరిగిన ఈ ఫన్నీ ప్రాంక్ కాల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోకి ప్రత్యేక అతిథిగా హాజరై, తన సింగర్స్‌తో కలిసి మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇటీవల కాలంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు బుల్లితెర వేదికలపై కాన్సర్ట్‌లు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న క్రమంలో థమన్ ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు.ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి, యాదమ్మ రాజులతో కలిసి ఈ షోను హోస్ట్ చేస్తున్న శ్రీముఖి.. మాటల మధ్యలో థమన్‌ను ఇండస్ట్రీలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని ప్రశ్నించారు. అఖిల్, సాయి ధరమ్ తేజ్ పేర్లను థమన్ చెప్పగా, వెంటనే తేజ్‌కు కాల్ చేసి లక్ష రూపాయలు అప్పు అడగాలని శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. శ్రీముఖి సూచనతో థమన్ కాల్ చేసి.. "నువ్వు నా ఫ్రెండ్‌వేనా? నాకు అర్జెంట్‌గా లక్ష రూపాయలు కావాలి, రేపు ఉదయం తిరిగి ఇచ్చేస్తాను" అని అడిగాడు. దానికి తేజ్ "ఇంత ఫాస్ట్‌గా ఎలా ఇచ్చేస్తావురా?" అని ఆశ్చర్యంగా అడిగాడు. ఈ సంభాషణ జరుగుతుండగా శ్రీముఖి వెనుక నుంచి థమన్‌కు మెల్లగా ప్రాంప్టింగ్ ఇస్తుండటంతో, ఫోన్‌లో అమ్మాయి గొంతు పసిగట్టిన తేజ్ "ఆ అమ్మాయి ఎవరు?" అని ప్రశ్నించాడు."స్మెల్ కూడా పట్టేస్తావా? ఇక్కడొక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా?" అని థమన్ అడగగా.. శ్రీముఖి వెంటనే ఫోన్ తీసుకుని "హాయ్ అండి.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా మీ కండలంటే మరీ ఇష్టం" అంటూ సరదాగా ప్రపోజ్ చేసింది. దీనికి సాయి ధరమ్ తేజ్ ఏమాత్రం తడుముకోకుండా "నాకంటే మా వాడి (థమన్) కండలు ఇంకా బాగుంటాయండి" అంటూ స్పాంటేనియస్‌గా కౌంటర్ ఇవ్వడంతో షోలో నవ్వులు పూశాయి.'పటాస్' షోతో కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి, తనదైన టైమింగ్‌తో ఈవెంట్‌ను రక్తికట్టించింది. మరోవైపు 'విరూపాక్ష', 'బ్రో' విజయాల తర్వాత సాయి ధరమ్ తేజ్ లైనప్ బలంగా ఉంది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన తేజ్‌తో శ్రీముఖి చేసిన ఈ చిలిపి సంభాషణ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరింత చదవండి

Source link