Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? | Ratnadeep Retail Files DRHP for Rs 400 Crore IPO to Expand Stores | బిజినెస్


Last Updated:

Ratnadeep IPO | తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్‌గా గుర్తింపు పొందిన రత్నదీప్ రిటైల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం రూ.400 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో కంపెనీ సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.

Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? (image: Ratnadeep)
Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? (image: Ratnadeep)

తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్న రత్నదీప్ రిటైల్ ఇప్పుడు పెద్ద అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం నిధులు సమీకరించాలనే లక్ష్యంతో కంపెనీ ఐపీఓ దిశగా ముందుకెళ్తోంది. ఈ ప్రక్రియలో ఎంత మొత్తం సమీకరించాలనుకుంటోంది, ఆ డబ్బును ఎలా వినియోగించనుంది, కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. సూపర్‌మార్కెట్ చైన్ రత్నదీప్ రిటైల్ ఐపీఓ కోసం భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబీ)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ప్రధానంగా కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు నిధులు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఐపీఓలో రూ.400 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. అదే సమయంలో ప్రమోటర్లు సందీప్ అగర్వాల్, మనీష్ భర్తియా, మితేష్ భర్తియా కలిసి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో గరిష్టంగా 1.48 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ వివరాలను జూలై 1న సమర్పించిన డీఆర్‌హెచ్‌పీలో వెల్లడించారు. కొత్త షేర్ల జారీకి ముందు కంపెనీ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.80 కోట్ల వరకు సమీకరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఒకవేళ ఆ ప్రక్రియ జరిగితే, కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించే మొత్తం అంత మేరకు తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: Ration Rice: రేషన్ బియ్యంపై కేంద్రం సంచలన నిర్ణయం… 30 ఏళ్ల తర్వాత తీపికబురు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఆహార పదార్థాలు, గ్రోసరీ, ఫ్యాషన్ ఉత్పత్తులు విక్రయిస్తున్న రత్నదీప్ రిటైల్ ప్రస్తుతం 190 స్టోర్లను నిర్వహిస్తోంది. కొత్తగా సమీకరించే నిధుల్లో రూ.260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ ఫార్మాట్‌లలో కొత్త స్టోర్లు ఏర్పాటు చేయడానికి వినియోగించనుంది. మరో రూ.40 కోట్లను కంపెనీ రుణాలు తీర్చడానికి ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనుంది. రత్నదీప్ రిటైల్‌కు మార్కెట్లో ఇప్పటికే లిస్టింగ్ ఉన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్, ట్రెంట్, స్పెన్సర్స్ రిటైల్, విశాల్ మెగా మార్ట్ వంటి కంపెనీల నుంచి పోటీ ఉంది.

2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.36.7 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.6 కోట్ల నష్టం వచ్చింది. అలాగే కంపెనీ ఆదాయం ఏడాది వ్యవధిలో 11.8 శాతం పెరిగి రూ.1,987.7 కోట్ల నుంచి రూ.2,223.1 కోట్లకు చేరుకుంది. ఈ ఐపీఓకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 July 2026, 9:26 pm Digital Edition : Prabhanews
Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? | Ratnadeep Retail Files DRHP for Rs 400 Crore IPO to Expand Stores | బిజినెస్

Last Updated:Jul 02, 2026 5:55 PM ISTRatnadeep IPO | తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్‌గా గుర్తింపు పొందిన రత్నదీప్ రిటైల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం రూ.400 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో కంపెనీ సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? (image: Ratnadeep)తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్న రత్నదీప్ రిటైల్ ఇప్పుడు పెద్ద అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం నిధులు సమీకరించాలనే లక్ష్యంతో కంపెనీ ఐపీఓ దిశగా ముందుకెళ్తోంది. ఈ ప్రక్రియలో ఎంత మొత్తం సమీకరించాలనుకుంటోంది, ఆ డబ్బును ఎలా వినియోగించనుంది, కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. సూపర్‌మార్కెట్ చైన్ రత్నదీప్ రిటైల్ ఐపీఓ కోసం భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబీ)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ప్రధానంగా కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు నిధులు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఐపీఓలో రూ.400 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. అదే సమయంలో ప్రమోటర్లు సందీప్ అగర్వాల్, మనీష్ భర్తియా, మితేష్ భర్తియా కలిసి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో గరిష్టంగా 1.48 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ వివరాలను జూలై 1న సమర్పించిన డీఆర్‌హెచ్‌పీలో వెల్లడించారు. కొత్త షేర్ల జారీకి ముందు కంపెనీ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.80 కోట్ల వరకు సమీకరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఒకవేళ ఆ ప్రక్రియ జరిగితే, కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించే మొత్తం అంత మేరకు తగ్గుతుంది.ఇది కూడా చదవండి: Ration Rice: రేషన్ బియ్యంపై కేంద్రం సంచలన నిర్ణయం... 30 ఏళ్ల తర్వాత తీపికబురుఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఆహార పదార్థాలు, గ్రోసరీ, ఫ్యాషన్ ఉత్పత్తులు విక్రయిస్తున్న రత్నదీప్ రిటైల్ ప్రస్తుతం 190 స్టోర్లను నిర్వహిస్తోంది. కొత్తగా సమీకరించే నిధుల్లో రూ.260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ ఫార్మాట్‌లలో కొత్త స్టోర్లు ఏర్పాటు చేయడానికి వినియోగించనుంది. మరో రూ.40 కోట్లను కంపెనీ రుణాలు తీర్చడానికి ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనుంది. రత్నదీప్ రిటైల్‌కు మార్కెట్లో ఇప్పటికే లిస్టింగ్ ఉన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్, ట్రెంట్, స్పెన్సర్స్ రిటైల్, విశాల్ మెగా మార్ట్ వంటి కంపెనీల నుంచి పోటీ ఉంది.2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.36.7 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.6 కోట్ల నష్టం వచ్చింది. అలాగే కంపెనీ ఆదాయం ఏడాది వ్యవధిలో 11.8 శాతం పెరిగి రూ.1,987.7 కోట్ల నుంచి రూ.2,223.1 కోట్లకు చేరుకుంది. ఈ ఐపీఓకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.Click here to add News18 as your preferred news source on Google. లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link