ప్రభన్యూస్

Pradeep Rawat: ఇక సెలవు.. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు పూర్తి..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో భయపెట్టిన ప్రదీప్ రావత్ ఇకలేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. గతకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రదీప్.. నిన్న రాత్రి ముంబైలో తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో పూర్తయ్యాయి.

News18
News18

ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో భయపెట్టిన ప్రదీప్ రావత్ ఇకలేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. గతకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రదీప్.. నిన్న రాత్రి ముంబైలో తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో పూర్తయ్యాయి. ఈయన మరణంతో యావత్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు.

ప్రదీప్ రావత్ సినిమాల్లో కంటే ముందు టెలివిజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీ.ఆర్.చోప్రా తెరకెక్కించిన ఐకానిక్ సీరియల్ మహాభారత్‌లో ప్రదీప్ రావత్ అశ్వత్థామ పాత్రలో కనిపించాడు. ఈ సీరియల్ ప్రదీప్‌కు తెచ్చిపెట్టిన ఫేమ్ అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ తర్వాత హిందీలో సర్పరోష్, లగాన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఇక లగాన్ సినిమా చూసిన రాజమౌళి.. ప్రదీప్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యాడు. దాంతో వెంటనే పిలిచి ‘సై’ సినిమాలో అవకాశం ఇచ్చాడు.

ఈ సినిమాలో భిక్షూ యాదవ్‌గా నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. అసలు కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. అలాంటి పాత్ర భిక్షూ యాదవ్. ఈ రోల్‌లో ప్రదీప్ రావత్‌ను తప్ప ఇంకొకరిని ఊహించడం కూడా చేయలేము. అంతలా తన విలనిజంతో ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత భద్ర సినిమాలో వీరయ్యగా, అందరివాడు సినిమాలో సత్తి బిహారీగా టెర్రిఫిక్ విలనిజం పండించాడు.

ప్రభాస్‌తో చేసిన ఛత్రపతి సినిమా ఇంకో లెవల్. ఈ మూవీలో రాస్ బిహారీగా యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు ఆ గెటప్.. ఆ విలనిజం టెర్రిఫిక్ అంతే. ఆ తర్వాత లక్ష్మీ, మాయాజలం, స్టాలిన్, దేశముదురు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో విలన్ రోల్స్ పోషిస్తూ టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా మారిపోయాడు. అసలు ఒక టైమ్‌లో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. కేవలం విలన్‌గానే కాదు.. కొన్ని సినిమాలో కామెడీతో కూడా మెప్పించాడు. ఓయ్, పూలరంగడు, నేను శైలజా, సరైనోడు వంటి సినిమాల్లో కామెడీ కూడా అదరొగొట్టేశాడు. తెలుగులో దాదాపు 65 సినిమాలు చేసిన ప్రదీప్ రావత్.. అన్ని భాషల్లో కలిపి దాదాపు 150 సినిమాల్లో నటించాడు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 8:31 pm Digital Edition : Prabhanews
Pradeep Rawat: ఇక సెలవు.. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు పూర్తి..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 05, 2026 7:26 PM ISTఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో భయపెట్టిన ప్రదీప్ రావత్ ఇకలేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. గతకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రదీప్.. నిన్న రాత్రి ముంబైలో తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో పూర్తయ్యాయి. News18ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో భయపెట్టిన ప్రదీప్ రావత్ ఇకలేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. గతకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రదీప్.. నిన్న రాత్రి ముంబైలో తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో పూర్తయ్యాయి. ఈయన మరణంతో యావత్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు.ప్రదీప్ రావత్ సినిమాల్లో కంటే ముందు టెలివిజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీ.ఆర్.చోప్రా తెరకెక్కించిన ఐకానిక్ సీరియల్ మహాభారత్‌లో ప్రదీప్ రావత్ అశ్వత్థామ పాత్రలో కనిపించాడు. ఈ సీరియల్ ప్రదీప్‌కు తెచ్చిపెట్టిన ఫేమ్ అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ తర్వాత హిందీలో సర్పరోష్, లగాన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఇక లగాన్ సినిమా చూసిన రాజమౌళి.. ప్రదీప్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యాడు. దాంతో వెంటనే పిలిచి 'సై' సినిమాలో అవకాశం ఇచ్చాడు.ఈ సినిమాలో భిక్షూ యాదవ్‌గా నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. అసలు కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. అలాంటి పాత్ర భిక్షూ యాదవ్. ఈ రోల్‌లో ప్రదీప్ రావత్‌ను తప్ప ఇంకొకరిని ఊహించడం కూడా చేయలేము. అంతలా తన విలనిజంతో ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత భద్ర సినిమాలో వీరయ్యగా, అందరివాడు సినిమాలో సత్తి బిహారీగా టెర్రిఫిక్ విలనిజం పండించాడు.ప్రభాస్‌తో చేసిన ఛత్రపతి సినిమా ఇంకో లెవల్. ఈ మూవీలో రాస్ బిహారీగా యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు ఆ గెటప్.. ఆ విలనిజం టెర్రిఫిక్ అంతే. ఆ తర్వాత లక్ష్మీ, మాయాజలం, స్టాలిన్, దేశముదురు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో విలన్ రోల్స్ పోషిస్తూ టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా మారిపోయాడు. అసలు ఒక టైమ్‌లో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. కేవలం విలన్‌గానే కాదు.. కొన్ని సినిమాలో కామెడీతో కూడా మెప్పించాడు. ఓయ్, పూలరంగడు, నేను శైలజా, సరైనోడు వంటి సినిమాల్లో కామెడీ కూడా అదరొగొట్టేశాడు. తెలుగులో దాదాపు 65 సినిమాలు చేసిన ప్రదీప్ రావత్.. అన్ని భాషల్లో కలిపి దాదాపు 150 సినిమాల్లో నటించాడు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link