Mann Ki baat: 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్.. సామాన్యుల సేవలకు జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ రేడియో ప్రసంగం |


Last Updated:

Mann Ki baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో పంచుకునే ప్రత్యేక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

మోదీ
మోదీ

2014 అక్టోబర్ 3న విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం 2026 అక్టోబర్ 3 నాటికి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. 2026 సెప్టెంబర్ 27న ప్రసారమైన ప్రసంగంతో ఈ కార్యక్రమం 138 ఎపిసోడ్లను విజయవంతంగా ముగించింది. రాజకీయ నినాదాలు, ఎన్నికల ప్రచారాలకు ఆస్కారం లేకుండా కేవలం పౌరుల విజయాలు, స్థానిక సేవలు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలను ప్రధాన వేదికగా ఎంచుకోవడమే దీని ప్రత్యేకత.

జల సంరక్షణ – ప్రజా భాగస్వామ్యం

ఈ కార్యక్రమంలో జల సంరక్షణ ఎప్పుడూ ఒక ప్రధాన అంశంగా కొనసాగుతోంది. 2016 నుంచే రాజస్థాన్, గుజరాత్ వంటి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాంప్రదాయ మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) పునరుద్ధరణను ప్రధాని ప్రస్తావించారు. జాలోర్‌లో స్థానికులు శ్రమదానం, చందాలతో పూడుకుపోయిన పురాతన బావులను బాగు చేసుకోవడం, అలాగే ఉదయ్‌పూర్‌లో యువత కలసి ‘సుల్తాన్ కీ బావ్డీ’ని పునరుద్ధరించిన తీరును మోదీ శ్లాఘించారు. జైసల్మేర్‌లో మహిళల బృందం కేవలం ఒక గంటలోనే 25,000 మొక్కలు నాటడం, అంతరించిపోతున్న ‘గోడవాన్’ (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) పక్షుల సంరక్షణ గురించి వివరిస్తూ పర్యావరణ పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు.

వ్యవసాయ ఆవిష్కరణలు – ‘వోకల్ ఫర్ లోకల్

వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలను ‘మన్ కీ బాత్’ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించింది. సాధారణంగా బీహార్, బెంగాల్‌లలో పండే లిచీ పండ్లను రాజస్థాన్‌కు చెందిన రైతు జితేంద్ర సింగ్ రణావత్ విజయవంతంగా పండించిన విధానాన్ని ప్రధాని 121వ ఎపిసోడ్‌లో కొనియాడారు. కరోనా సమయంలో అజ్మీర్‌కు చెందిన సేథా సింగ్ రావత్ తన టైలరింగ్ వృత్తిని ‘దర్జీ ఆన్‌లైన్’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మార్చడాన్ని ఉదాహరణగా చూపుతూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. 131వ ఎపిసోడ్‌లో భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

2026 ఎపిసోడ్లలో సరికొత్త స్ఫూర్తి కథనాలు

2026 ప్రారంభంలో ప్రసారమైన ఎపిసోడ్లలో ఆజంగఢ్‌లో తమ్సా నది పునరుజ్జీవనం, పన్నాలో అటవీ గార్డు జగదీష్ ప్రసాద్ మూలికా మొక్కలపై చేపట్టిన అధ్యయనం, యువ అథ్లెట్లు గురీందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజూర్‌ల ప్రతిభను దేశానికి పరిచయం చేశారు. అంతేకాకుండా కేరళకు చెందిన పది నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం మరణానంతరం ఆమె తల్లిదండ్రులు అవయవదానం చేసి చూపిన ఔదార్యాన్ని 131వ ఎపిసోడ్‌లో ప్రస్తావించి సామాజిక స్పృహను చాటారు.

కేవలం పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా పొలాలు, పాఠశాలలు, గ్రామాల నుంచి దేశ నిర్మాణం జరుగుతుందని ‘మన్ కీ బాత్’ నిరూపించింది. ఆకాశవాణి, దూరదర్శన్‌తో పాటు డిజిటల్ మీడియా ద్వారా దేశ నలుమూలల ప్రజల చిన్న చిన్న ప్రయత్నాలను జాతీయ స్థాయి ఉద్యమాలుగా తీర్చిదిద్దుతూ ఈ ప్రయాణం సాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 October 2026, 11:26 am Digital Edition : Prabhanews
Mann Ki baat: 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్.. సామాన్యుల సేవలకు జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ రేడియో ప్రసంగం |

Last Updated:Oct 04, 2026 11:17 AM ISTMann Ki baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో పంచుకునే ప్రత్యేక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.మోదీ2014 అక్టోబర్ 3న విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం 2026 అక్టోబర్ 3 నాటికి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. 2026 సెప్టెంబర్ 27న ప్రసారమైన ప్రసంగంతో ఈ కార్యక్రమం 138 ఎపిసోడ్లను విజయవంతంగా ముగించింది. రాజకీయ నినాదాలు, ఎన్నికల ప్రచారాలకు ఆస్కారం లేకుండా కేవలం పౌరుల విజయాలు, స్థానిక సేవలు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలను ప్రధాన వేదికగా ఎంచుకోవడమే దీని ప్రత్యేకత.జల సంరక్షణ - ప్రజా భాగస్వామ్యంఈ కార్యక్రమంలో జల సంరక్షణ ఎప్పుడూ ఒక ప్రధాన అంశంగా కొనసాగుతోంది. 2016 నుంచే రాజస్థాన్, గుజరాత్ వంటి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాంప్రదాయ మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) పునరుద్ధరణను ప్రధాని ప్రస్తావించారు. జాలోర్‌లో స్థానికులు శ్రమదానం, చందాలతో పూడుకుపోయిన పురాతన బావులను బాగు చేసుకోవడం, అలాగే ఉదయ్‌పూర్‌లో యువత కలసి 'సుల్తాన్ కీ బావ్డీ'ని పునరుద్ధరించిన తీరును మోదీ శ్లాఘించారు. జైసల్మేర్‌లో మహిళల బృందం కేవలం ఒక గంటలోనే 25,000 మొక్కలు నాటడం, అంతరించిపోతున్న 'గోడవాన్' (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) పక్షుల సంరక్షణ గురించి వివరిస్తూ పర్యావరణ పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు.వ్యవసాయ ఆవిష్కరణలు - ‘వోకల్ ఫర్ లోకల్వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలను ‘మన్ కీ బాత్’ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించింది. సాధారణంగా బీహార్, బెంగాల్‌లలో పండే లిచీ పండ్లను రాజస్థాన్‌కు చెందిన రైతు జితేంద్ర సింగ్ రణావత్ విజయవంతంగా పండించిన విధానాన్ని ప్రధాని 121వ ఎపిసోడ్‌లో కొనియాడారు. కరోనా సమయంలో అజ్మీర్‌కు చెందిన సేథా సింగ్ రావత్ తన టైలరింగ్ వృత్తిని 'దర్జీ ఆన్‌లైన్' పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మార్చడాన్ని ఉదాహరణగా చూపుతూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. 131వ ఎపిసోడ్‌లో భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.2026 ఎపిసోడ్లలో సరికొత్త స్ఫూర్తి కథనాలు2026 ప్రారంభంలో ప్రసారమైన ఎపిసోడ్లలో ఆజంగఢ్‌లో తమ్సా నది పునరుజ్జీవనం, పన్నాలో అటవీ గార్డు జగదీష్ ప్రసాద్ మూలికా మొక్కలపై చేపట్టిన అధ్యయనం, యువ అథ్లెట్లు గురీందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజూర్‌ల ప్రతిభను దేశానికి పరిచయం చేశారు. అంతేకాకుండా కేరళకు చెందిన పది నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం మరణానంతరం ఆమె తల్లిదండ్రులు అవయవదానం చేసి చూపిన ఔదార్యాన్ని 131వ ఎపిసోడ్‌లో ప్రస్తావించి సామాజిక స్పృహను చాటారు.కేవలం పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా పొలాలు, పాఠశాలలు, గ్రామాల నుంచి దేశ నిర్మాణం జరుగుతుందని ‘మన్ కీ బాత్’ నిరూపించింది. ఆకాశవాణి, దూరదర్శన్‌తో పాటు డిజిటల్ మీడియా ద్వారా దేశ నలుమూలల ప్రజల చిన్న చిన్న ప్రయత్నాలను జాతీయ స్థాయి ఉద్యమాలుగా తీర్చిదిద్దుతూ ఈ ప్రయాణం సాగుతోంది.మరింత చదవండి

Source link