అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్‌లో భారత కరెన్సీ ప్రకారం 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,36,466గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ. 3,386 పెరిగింది. అదే విధంగా, భారతీయులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే దుబాయ్ మార్కెట్‌లో కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.1,28,266గా ఉంది.

