Last Updated:
మసాలాలు బాగా పట్టించిన చికెన్ ముక్కలను కరకరలాడేలా నూనెలో వేయిస్తే వచ్చే రుచి, సువాసనే ప్రత్యేకంగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ చికెన్ పకోడీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
చికెన్ పకోడీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఇష్టమైన స్టార్టర్. మసాలాలు బాగా పట్టించిన చికెన్ ముక్కలను కరకరలాడేలా నూనెలో వేయిస్తే వచ్చే రుచి, సువాసనే ప్రత్యేకంగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ చికెన్ పకోడీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పార్టీలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లో స్టార్టర్‌గా మాత్రమే కాకుండా పప్పు, పప్పుచారు, రసం, అన్నంతో సైడ్ డిష్‌గా కూడా తినవచ్చు. ముఖ్యంగా ఎలాంటి కృత్రిమ రంగులు, అజినొమోటో, మైదా, కార్న్‌ఫ్లోర్ లేకుండా మన తెలుగు స్టైల్‌లో తయారు చేస్తే రుచి మరింత బాగుంటుంది.

