Rats: ఇళ్లల్లో ఎలుకల సమస్య అనేది చాలా మందిని వేధిస్తున్న ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎలుకలు ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశిస్తే.. వంటగదిలోని ఆహార పదార్థాలను నాశనం చేయడమే కాకుండా, విలువైన బట్టలు, సోఫాలు, చివరకు ఎలక్ట్రానిక్ వస్తువుల వైర్లను కూడా కొరికేసి వేల రూపాయల నష్టం తెచ్చిపెడుతుంటాయి. వీటిని చంపడానికి మార్కెట్లో దొరికే విషపూరిత రసాయన మందులు వాడితే.. అవి తిని ఎలుకలు ఇళ్లల్లోని మూలల్లో చనిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. పైగా ఇంట్లో చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే ఆ కెమికల్స్ వాడటం చాలా ప్రమాదకరం. అలాంటి ఇబ్బంది లేకుండా, ఎలుకలను చంపకుండా కేవలం మీ వంటింటి వస్తువులతోనే ఇంటి నుండి శాశ్వతంగా తరిమికొట్టే 5 అద్భుతమైన హోం రెమెడీస్ ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

