మన రక్త వర్గం అంటే A, B, AB, O లేదా Rh Positive, Rh Negative వంటి రకాలు ఎర్ర రక్త కణాలపై ఉండే ప్రత్యేక ప్రోటీన్లు, యాంటీజెన్ల ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ ఎర్ర రక్త కణాలు ప్లాసెంటాను దాటి బిడ్డ శరీరంలోకి వెళ్లవు. అందువల్ల బిడ్డకు తన సొంత రక్త కణాలు ఏర్పడతాయి. గర్భంలోనే బిడ్డ శరీరంలో ఎముకల లోపల ఉండే బోన్ మ్యారో (Bone Marrow) అభివృద్ధి చెందుతుంది. అక్కడే కొత్త ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. గర్భధారణ ప్రారంభ దశలో కాలేయం (లివర్), ప్లీహం (స్ప్లీన్) కూడా ఈ ప్రక్రియలో సహాయపడతాయి.

