విజయనగర సామ్రాజ్యాన్ని అత్యంత వైభవంగా పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో ‘దేవరాయ (Devaraaya)’ పేరుతో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెరకెక్కుతోంది. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ లుక్‌ను పరిచయం చేశారు. రాజసం, వీరత్వం ఉట్టిపడేలా ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Source link
శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్!
