Last Updated:
ITR Filing 2026: 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలాలు 7 కోట్ల మార్కును దాటాయి. అయితే వ్యాపారం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు ఇంకా గడువు ఉండటంతో.. ఆగస్టు 31లోపు రిటర్న్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ముఖ్యంగా ITR-3, ITR-4, ITR-5, ITR-7 దాఖలు చేయాల్సిన వారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది.
2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) దాఖలు సంఖ్య 7 కోట్ల మార్కును దాటింది. గడువు తేదీ సమీపిస్తున్న సమయంలోనే ఈ స్థాయిలో రిటర్న్‌లు దాఖలు కావడం పన్ను చెల్లింపుదారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు చూపిస్తోంది. అయితే, వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు రిటర్న్‌లు దాఖలు చేసేందుకు ఆగస్టు 31, 2026 వరకు మాత్రమే సమయం ఉంది. దీంతో చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ITR ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది.

